#అచ్చులు_హల్లులతో_గణపతి_పూజ #సేవ – తెలుగు భాషా ఉత్సవాలు 29-31 ఆగుస్ట్ 2025-శీర్షిక : నా తెలుగు భాష#కవి_పేరు_తుమ్మ జనార్దన్_జ్ఞాన్
అచ్చులు హల్లులతో గణపతి పూజ అ మ్మ చేతిలో తయారైన ఆ గణనాధుడు ఇ ప్పుడే బయలుదేరాడు ఈ రోజే వస్తున్నాడు ఉ మాపుత్రుడికి ఉండ్రాళ్ళు సిద్దంగా ఉంచండి ఊ రూరా స్వాగతమంటూ... ఎ లుక వాహనమెక్కి ఏ తెంచినాడు మన ఏకదంతుడు ఐ కమత్యము నేర్పి ఆదరించ ఒ క్కమారు పిలువాగానే గజకర్ణుడు ఓ ఓ యంటూ వడివడిగా వచ్చినాడు ఔ రా మన గణపతిని అం బాసుతుడిని భక్తితో అహ ర్నిశలు కొలుద్దాం. క మ్మనైన పాయసాలు నీకు కవీశా ఖ ర్జూరం, అరటి, జామ, దానిమ్మ ఫలాలు గ ణనాధుని మ్రొక్కి దీవించమంటూ ఘు మఘుమలాడే పిండివంటలూ క ఙ్క ణమ్ (కంకణం) కట్టుకొని చ క్రాల రథముపై ఊరేగిస్తూ చతుర్భుజుని ఛ త్రము పట్టి విఘ్నురాజుని జం బూ ద్వీపం భారత ఖండం అంతా ఝం డాలు అలంకరించి దండాలు చేస్తూ జ్ఞా నమిమ్మని గణనాయకుడికి మ్రోక్కుదాం ట క టకా టకా టకా అడుగులే వేస్తూ ఠం ఠం ఠం ఠం డప్పులే మ్రోగ్రగా డ మరుక ధ్వానాలతో ఢం కా నినాదాలతో తోడ్కోనివద్దాం గ ణ నాయకునికి వందనాలిడదాం తం డోప తండాలుగా చేరి క థ విందాం గణపతిది ద యజూపు మాపైన గణాధ్యక్షా ధ నధాన్యాలిమ్మని దూమ...