సుందర చైతన్య ఆశ్రమం Telugu Wiki link
సుందర చైతన్య ఆశ్రమం
Telugu Wiki link:
https://w.wiki/HFyF
గత నలభై ఐదు సంవత్సరాలుగా పూజ్య స్వామీజీ ఆంధ్రావనికి అందించిన ఆధ్యాత్మిక సేవలు అనితర సాధ్యాలు. ఈ మహత్తర కార్యక్రమానికి కార్యక్షేత్ర౦గా 1984, మే 11 వ తేది ప్రథమంగా ధవళేశ్వరం సుందర చైతన్యాశ్రమం రూపు దిద్దుకుంది. తపోవనంలా, సుందర నందనోద్యాన వనంలా శోభించే ఆశ్రమం వేలాది సత్సంగీయులకు, భక్తులకు స్ఫూర్తి కేంద్రంగా దినదినాభివృద్ధి చెందింది.
అద్భుత కలాఖండమైన ఈ ఆశ్రమం ప్రస్తుతం వానప్రస్తాశ్రమంగా అలరారుతోంది.
1997 డిసెంబరు 25 వ తేది అభినవ బృందావనంలా హైదరాబాదు సుందర చైతన్యాశ్రమం వెలసింది.
దేశ విదేశాలలో ఆధ్యాత్మిక సేవలందించేందుకు శ్రీ స్వామీజీ వారికి ఆశ్రమం ఒక పనిముట్టు అయ్యింది. పచ్చని పొలాల మధ్య పదమూడు ఎకరాల స్థలంలో నిర్మింపబడిన ఈ సువిశాలమైన ఆశ్రమం భక్తుల పాలిటి కల్పవృక్షం. భక్తీ భావ పరంపరలో ముంచెత్తే 76 అడుగుల ఎత్తు గల మురళీకృష్ణ భగవానుని దేవాలయం, నిరంతరం గురుదేవుల జ్ఞాన ప్రభోదాలతో ప్రతిధ్వనించే శృతి మందిరం - ఈ రెండూ భక్తీ జ్ఞాన సమ్మేళనమైన సుందర చైతన్య మహోద్యమానికి సంకేతాలు. 2002 జూన్ 19 వ తేదిన విశాఖ సాగర తీరంలో మూడవది అయిన సుందర చైతన్య ఆశ్రమం నెలకొల్ప బడింది.

Comments
Post a Comment